CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..
- కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభం..
- ఒకప్పుడు లారీలో వెళ్లి సినిమాలు చూసేవాడినన్న సీఎం రేవంత్..
- అల్లు అర్జున్ హాలీవుడ్లో కూడా రాణించాలని ఆకాంక్షించిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కోకాపేటలో అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయికి ఎదగాలని.. హాలీవుడ్‌ను సైతం ఆకర్షించేలా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికే జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందని.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై నిలవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా ఇప్పటికే తన ముద్ర వేశారు. ఇకపై ఆయన లక్ష్యం హాలీవుడ్ స్థాయిని అందుకోవాలి. అక్కడి సినిమాలతో పోటీపడేలా ఆయన భవిష్యత్ ప్రయాణం ఉండాలని సీఎం ఆకాంక్షించారు.
Also Read:IPL 2026: RCBకి బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం..!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి తన వ్యక్తిగత సినిమా అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు థియేటర్లలో సినిమాలు చూసేందుకు లారీల్లో ప్రయాణించిన రోజులను నెమరువేసుకున్న ఆయన.. నేడు టాలీవుడ్ ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్న తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా రంగాన్ని కూడా అత్యంత ముఖ్యమైన పరిశ్రమగా ప్రభుత్వం గుర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
Also Read:Ration Cards : రేషన్ కార్డుతో సంబంధం లేదు.. ఇక నుంచి ఫ్యామిలీ కార్డులే..
హైదరాబాద్ నగరంలో హాలీవుడ్ స్థాయి షూటింగ్‌లు జరిగేలా ఇక్కడి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అల్లు కుటుంబం అత్యాధునిక హంగులతో మల్టీప్లెక్స్‌ను నిర్మించడంపై అభినందనలు తెలియజేస్తూ.. ఇలాంటి ప్రాజెక్టులు హైదరాబాద్ సినిమా కళావైభవాన్ని మరింత పెంచుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!