CM Revanth Reddy : హైదరాబాద్లో భారీ వర్షాలు.. అధికారులను హై అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
- భారీ వర్షాలపై సీఎం అలర్ట్
- అధికారులకు కీలక ఆదేశాలు
- లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- సమన్వయంతో సహాయక చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అకస్మాత్తుగా మారిన వాతావరణం, కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వరద నీరు నిలిచే చోట్ల తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని రంగంలోకి దించాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఎవరూ అజాగ్రత్తగా ఉండకూడదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని సీఎం ఆదేశించారు.
Also Read
- TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
నగరంలో సాధారణ జనజీవనానికి, రవాణా వ్యవస్థకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ (GHMC), హైడ్రా (HYDRAA), విద్యుత్ శాఖ, వాటర్ బోర్డ్తో పాటు ఇతర సంబంధిత శాఖలన్నీ పూర్తి సమన్వయంతో రంగంలోకి దిగాలని ఆదేశించారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్లను నివారించడం, విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించడం, కరెంట్ స్తంభాలు , ఓపెన్ డ్రైనేజీల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని , ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.
తాజావార్తలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!