Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Historic Decisions Medaram Jatara Development

CM Revanth Reddy : ధీరత్వమే దైవత్వంగా మారిన చరిత్ర మేడారం మహోత్సవం

Published Date :January 18, 2026 , 10:54 pm
By Gogikar Sai Krishna
  • ధీరత్వమే దైవత్వంగా మారిన చరిత్ర మేడారం మహోత్సవం
  • కాకతీయులకు ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క-సారలమ్మలు
  • దక్షిణాది కుంభమేళా మేడారం జాతర
  • ఆనాడు ఫిబ్రవరి 6, 2023న ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించా
  • తల్లుల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -సీఎం రేవంత్‌
CM Revanth Reddy : ధీరత్వమే దైవత్వంగా మారిన చరిత్ర మేడారం మహోత్సవం
  • Follow Us :
  • google news
  • dailyhunt

దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలతో గిరిజన గడ్డపై అడుగుపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల, అది కూడా మేడారం వంటి పుణ్యక్షేత్రంలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. మేడారం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గిరిజన తల్లుల గొప్పతనాన్ని కొనియాడారు. “ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీరవనితలు సమ్మక్క-సారలమ్మలు. గుడి లేని ఆ తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ ప్రజల అతిపెద్ద గిరిజన సంస్కృతికి ఈ జాతర నిదర్శనం” అని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు.

తన రాజకీయ ప్రస్థానంలో మేడారం పాత్రను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 6న అప్పటి ప్రజా కంటక పాలనను గద్దె దించాలని ఇదే మేడారం గడ్డపై మొక్కుకుని తాను పాదయాత్ర ప్రారంభించానని తెలిపారు. “ఆనాడు తల్లుల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేడు ఆ మొక్కును తీర్చుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం వంద రోజుల వ్యవధిలోనే రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని తాను అధికారులను ఆదేశించానని, జాతర నాటికి ఆ పనులన్నీ పూర్తి కావడం గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో తన జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే, గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకుంటానని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

భక్తుల సౌకర్యార్థం జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. రామప్ప, లక్నవరం చెరువుల నుండి జంపన్న వాగుకు నీటిని తరలించేలా శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రేపు ఉదయం సమ్మక్క-సారక్క నూతన ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు. మేడారం జాతరను దేశవ్యాప్తంగా గుర్తించేలా, కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, గిరిజన సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

IND vs NZ: రోహిత్ శర్మ 2027 ODI వరల్డ్ కప్‌కు దూరమవుతాడా?.. ODI సిరీస్‌లో ఘోరంగా విఫలం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • Kumbh Mela South
  • MEDARAM JATARA
  • Sammakka Saralamma
  • Telangana Politics

తాజావార్తలు

  • China and Russia Back Cuba: క్యూబా కోసం ఏకమైన చైనా-రష్యా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

  • BCCI: ‘బీసీసీఐ నన్ను నిర్లక్ష్యం చేసింది.. రాజీనామా చేస్తున్నా’-భారత మాజీ క్రికెటర్..

  • Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల

  • LPG Shortage: LPG సిలిండర్ల డెలివరీపై మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..

  • Tata Motors: పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఏప్రిల్ 1 నుంచే అమలు…

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions