Site icon NTV Telugu

CM Revanth Reddy : ఉద్యోగులకు రేవంత్‌ రెడ్డి వార్నింగ్.. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం కట్..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ఆరు దశాబ్ధాల పాటు జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ చారి, ఇషాన్ రెడ్డిలను స్మరించారు.

IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్.. అభిషేక్ శర్మ సెంచరీ పక్కా!

రాష్ట్రాన్ని ఒక కుటుంబం, ఒక పార్టీ సొత్తు అనుకునే రోజులు ముగిశాయని ఆయన వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించని పూర్వ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నియామకాల విషయంలో పారదర్శకత పాటించక ఐదు కోట్లు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. “మీ నియామకాలపై నేను ఎన్నికల ఫలితాలకంటే ఎక్కువ టెన్షన్ పడ్డా” అని సీఎం స్పష్టం చేశారు.

అంతేకాకుండా.. కోచింగ్ సెంటర్ల కుట్రలపై కూడా అభ్యర్థులను అప్రమత్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టి కేసులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను మనం సృష్టించాలని, గుజరాత్ మోడల్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని అన్నారు. ఉద్యోగులు ప్రజాసేవలో తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని సీఎం సూచించారు. త్వరలో తల్లిదండ్రుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, వారి పట్ల నిర్లక్ష్యం కనబరిస్తే జీతం నుండి 10 శాతం కోసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన ప్రకటించారు. “మీ కళ్లల్లో కంటే, మీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలని నేను కోరుకుంటున్నాను” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Manchu Manoj: తేజ సజ్జాతో గొడవలపై స్పందించిన మనోజ్

Exit mobile version