NTV Telugu Site icon

New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల జారీ ప్రక్రియ‌పై తెలంగాణ ప్రభుత్వం క‌స‌ర‌త్తు

Tg Ration Health Cards

Tg Ration Health Cards

కొత్త రేష‌న్ కార్డుల జారీ ప్రక్రియ‌పై తెలంగాణ ప్రభుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. రేష‌న్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్టోబ‌రు 2 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని సీఎం రేవంత్‌ సూచించారు. రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స‌చివాల‌యంలో గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేదానిపై క‌స‌ర‌త్తు చర్చించారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Bandi Sanjay : 2019లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం

Show comments