NTV Telugu Site icon

CM Revanth Reddy : ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్ కు అడ్డా

Cm Revanth

Cm Revanth

సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితం చేశారు. రెండో పంప్‌ హౌస్‌ వద్ద పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌.. అనంతరం స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని, ఖమ్మం గడ్డ మీద నుంచే రెండు లక్షల రుణ మాఫి గురించి హామి ఇచ్చామన్నారు. సోనియాగాంధీ మాట ఇచ్చింది అంటే హామీ నెరవేర్చలసిందేనని, పట్టువదలకుండ భట్టి విక్రమార్క రైతు రుణ మాఫీ చేస్తున్నారన్నారు. ఎంత మంది అడ్డుపడ్డ, కాళ్ళకి అడ్డం పడ్డా హామీ నెరవేరుస్తున్నామన్నారు. 18000 కోట్ల రూపాయలు 27 రోజుల్లో రైతులకి ఇచ్చామన్నారు. హరీష్ రావు చీము నెత్తురు వుంటే సిగ్గు లజ్జ వుంటే రాజీనామా చెయ్య్ అని ఆయన వ్యాఖ్యానించారు. సిగ్గు వుంటే రాజీనామా చెయ్ అని ఆయన సవాల్‌ విసిరారు.

USA: ల్యాండింగ్ సమయంలో షాకిచ్చిన పైలట్.. హడలెత్తిపోయిన ప్రయాణికులు

అంతేకాకుండా..’అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి క్షమాపణ చెప్పు. నాలుగు లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేశాం. ఓరి సన్నాసి అసెంబ్లీ లో సీట్లు తగ్గితే పార్లమెంటు లో గుండు సున్న ఇచ్చా. బీఆర్‌ఎస్‌ బతుకు బస్ స్టాండ్ అయ్యింది. ప్రజల నే దోషులుగా చేసే ప్రక్రియ చేస్తున్నారు. కృష్ణ నది జలాలు పారక పోతే గోదావరి జలాలు తో పంటలు సాగు కు ఇస్తాం. పది వేల కోట్లు సీతారామ కి అవసరం. 2026 15 వరకు సీతారామ పూర్తి చేస్తాం. మాట ఇస్తున్నాము. ఎన్ని వేల కోట్లు అవసరం అయిన ఇస్తాం. ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తాం. మున్నేరు నది మీద 32 టిఎంసి రిజర్వాయర్ గ్రావిటీ ద్వారా ఇచ్చేందుకు కృషి చేస్తాం. వీరభద్రుడి పేరు మీద 15 టిఎంసి రిజర్వాయర్ నిర్మాణం కూడా చేపడతాం. ఈ గొప్పతనం అంతా ఖమ్మం జిల్లాకే దక్కుతుంది. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ కుగాడిద గుడ్డు వుంది. వాళ్ళు మారలేదు సిగ్గులేదు. అబద్దాల చెబుతూ బావ బావమరిది లు తిరుగుతున్నారు.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

USA: ల్యాండింగ్ సమయంలో షాకిచ్చిన పైలట్.. హడలెత్తిపోయిన ప్రయాణికులు