Site icon NTV Telugu

CM Revanth Reddy :ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపు చర్చలపై కీలక మలుపు

Revanth

Revanth

CM Revanth Reddy : తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో సీఎం ఏ.రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు కలిసి కీలకంగా చర్చించారు. ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలంలో సిద్ధమైన విజిలెన్స్‌ రిపోర్ట్‌ను తిరిగి పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రిపోర్ట్‌లో అనేక ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని లాభాల కోసం వినియోగించుకున్నట్లు స్పష్టంగా తేలినట్టు తెలుస్తోంది.

Donald Trump: ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఫైర్.. ఖతార్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరిక

విద్యార్థి సంఘాలు కూడా ఈ రిపోర్ట్‌ను వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. కాలేజీలు విద్యా ప్రమాణాలను విస్మరించి బకాయిల చెల్లింపుల పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నకిలీ సిబ్బందిని చూపించి అనుమతులు పొందడం, సౌకర్యాలు కల్పించకుండా కోట్లు దాచుకోవడం, తనిఖీలు తూతూమంత్రంగానే జరగడం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా, కోట్ల రూపాయల నిధులు కాలేజీ యాజమాన్యాల మధ్య చేతులు మారుతున్నాయంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్‌ రిపోర్ట్‌ను సమగ్రంగా పరిశీలించేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే అక్రమాలకు పాల్పడిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవచ్చని సంకేతాలు ఇస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపుల చర్చలు ఈసారి ఎటువంటి నిర్ణయానికి దారితీస్తాయో విద్యార్థులు, కాలేజీలు, తల్లిదండ్రులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Waqf Act : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు

Exit mobile version