CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జులై 7న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాజధానిలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానం మరియు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలవనున్నారని సమాచారం. రాష్ట్రానికి కావలసిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
Medical shops: రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా.. వయాగ్రా ట్యాబ్లెట్స్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరు
అలాగే, హైదరాబాద్ మెట్రో రైల్వే రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్, రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర మరియు దక్షిణ భాగాలపై కేంద్ర స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎంలు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇక రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అర్హులైన వారికి కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. జులై 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇదే 47వసారి కావడం గమనార్హం.
Samantha: ఏంటి సమంత.. అలా స్టేజిపై ఏడ్చేశావ్.. అభిమానులు ఏమై పోవాలి..!
