NTV Telugu Site icon

CM Revanth Reddy: స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు.. హరీష్ కు రేవంత్ కౌంటర్…

Revanth Reddy Harish Rao

Revanth Reddy Harish Rao

CM Revanth Reddy: స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తదన్నారు. హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Minister Komati Reddy: నువ్వు బీఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమే.. హరీష్‌ రావుకు కోమటిరెడ్డి కౌంటర్‌

రాజీనామా లేఖ అలా ఉండదని పేర్కొన్నారు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని స్ఫష్టం చేశారు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని అన్నారు. హరీష్.. ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నామన్నారు. ఆగస్టు 15లోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. నీ రాజీనామా రెడీగా పెట్టుకోవాలని సవాల్ విసిరారు.

Read also: KCR Bus Yatra: నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ లో కేసీఆర్‌ పర్యటన.. రోడ్‌ షో

స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే నా రాజీనామా ఆమోదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాసి స్పీకర్‌ను కోరారు. 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామన్నారని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే..
Harish Rao: నా రాజీనామా ఆమోదించండి.. స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ..