NTV Telugu Site icon

CM Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి మృతి.. సంతాపం తెలిపిన సీఎం

Revanth Reddy Cm

Revanth Reddy Cm

CM Revanth Reddy: మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఎన్నో సేవలు చేశానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నర్సారెడ్డి అనుభవాలు తమకు మార్గదర్శకమని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.

Read also: Nizamabad CI Arrest: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్.. నిజామాబాద్ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్..!

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సారెడ్డి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామం. 1931 సెప్టెంబర్ 22న జన్మించిన నర్సారెడ్డి ఉన్నత విద్యను అభ్యసించారు. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. అతను తన యవ్వనంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. హైదరాబాద్‌ను నిజాం పాలన నుంచి విముక్తి చేసేందుకు జరిగిన పోరాటంలో నర్సారెడ్డి కూడా పాల్గొన్నారు. 1971 నుంచి 1972 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 ఎన్నికల తర్వాత నర్సా రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటి పారుదల, దేవాదాయ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1967 నుంచి 1982 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.1991లో ఆదిలాబాద్ ఎంపీగా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు.
Pariksha Pe Charcha: “ఒక పిల్లవాడిని మరొకరితో పోల్చకండి”.. తల్లిదండ్రులకు పీఎం మోడీ సూచన..