Site icon NTV Telugu

CM Revanth Reddy : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తా…

Cm Revanth Reddy

Cm Revanth Reddy

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ జైపాల్ రెడ్డి ఒక సిద్ధాంతకర్తగా పనిచేశారని, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది,కానీ అధికారంలోకి రాలేదన్నారు. 2014 ఎన్నికల్లో స్వర్గీయ జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రకటించినుంటే అధికారంలోకి వచ్చేదని, కల్వకుర్తి 100 వంద పడకల ఆసుపత్రి.. 180 కోట్లతో నియోజకవ్గంలోని రోడ్ల నిర్మానాణానికి మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మాడ్గుల మండలంలో 10 కోట్లతో పాఠశాల కనీస వసతులు కల్పి్స్తామన్నారు.

 
Rainbow Children’s Hospital: అగ్రగామి ఫార్మా కంపెనీలతో అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం..
 

అంతేకాకుండా.. నియోజక వర్గంలో అన్ని తండాలకు బీటీ రోడ్లు వేస్తామన్నారు. కల్వకుర్తి నుండి హైదరాబాద్ వరకు 4 లైన్ రోడ్లు వేస్తామని, తను చదువుకున్న తాండ్ర పాఠశాల 5 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. వెల్దండ మండలం 5 కోట్లు అభివృద్ధి చేస్తామని, స్కిల్ యూనివర్శిటీ డెవలప్మెంట్ కల్వకుర్తి నియోజకవర్గానికి సమీపంలో కందుకూరు మండలం ముచర్ల దగ్గరలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడో విడత ఆగస్టు నెలలో రుణమాఫీ చేస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తా అని ఆయన వ్యాఖ్యానించారు.

Gottipati Ravikumar: రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి.. లైన్మెన్ను అభినందించిన మంత్రి

Exit mobile version