NTV Telugu Site icon

CM Revanth Reddy: ఢిల్లీలో విదేశీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం..

Revanth Reddy Dhilhi Tour

Revanth Reddy Dhilhi Tour

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సొంత దేశంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగంలోని పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని తెలిపారు.

Read also: Vikarabad Crime: దారుణం.. దళిత మహిళపై ఎస్ఐ చిత్రహింసలు..

సీఎం రేవంత్ రెడ్డిని అభిషేక్ మను సింఘ్వీ కలిశారు. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభకు వెళ్లనున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం గౌరవంగా భావిస్తున్నా అని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అంశాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వరంగల్‌లో జరిగే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు మూడు రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు.

Read also: Ram Charan : రామ్ చరణ్ పై ఫ్రెంచ్ నటుడి సంచలన కామెంట్స్

కొత్త పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు చర్చించనున్నారు. తమ పదవుల కోసం ఇప్పటికే సీనియర్ అధికారులతో తీవ్ర చర్చలు జరిపిన అభ్యర్థులు. ఆ భగవంతుని ఆశీస్సులు మనకు కాకుండా మనకే ఉంటాయని ఆశావహులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆశావహుల అంచనాలు ఈసారి ఫలిస్తాయా? లేదా తెలుసుకోవాలి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Pawan Kalyan : భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..?

Show comments