Site icon NTV Telugu

CM KCR: రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

Kcr

Kcr

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర చర్యలపై మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేస్తున్నారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరద నుంచి ప్రజలను కాపాడుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చూడాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. సహాయక చర్యల కోసం క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని సీఎస్ శాంతికుమార్ కు సీఎం దిశానిర్దేశం చేశారు. భారీ వరదల నుంచి ప్రాజెక్టుల దగ్గరే ఉంటూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ నీటిని కిందకి వదలాలని ఈఎన్సీలకు, చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Read Also: PM Modi: సామాన్య ప్రజల కలలు నెరవేరుతున్నాయి.. ప్రతిపక్షాలు ఆగ్రహిస్తున్నాయి: ప్రధాని మోడీ

అయితే, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం స్కూల్స్ , కాలేజీలకు, పలు కంపెనీలకు మూడు రోజుల పాటుగా సెలవులను ప్రకటించింది. ఇప్పటికే వర్షాలపై పలు డిపార్ట్మెంట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను హెల్త్, పోలీస్, మున్సిపల్, డిజాస్టర్ అధికారులు తీవ్రంగా శ్రమించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లోని గ్రామాలు పూర్తిగా వరద ప్రవాహంలో మునిగిపోయాయి. దీంతో పలువురు నీటిలో చిక్కుకుపోయిన వారిని రెస్య్కూ టీమ్స్ రక్షిస్తున్నాయి.

Read Also: AP CM Jagan: పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం జగన్‌

Exit mobile version