NTV Telugu Site icon

CM KCR: రైతు సంఘాల నేతలతో నేడు సీఎం కేసీఆర్‌ భేటీ

Kcr

Kcr

రైతు సంఘాల నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్ నుంచి వచ్చిన 100 మంది రైతు సంఘాల నేతలు కేసీఆర్‌ను కలవనున్నారు.. ఇప్పటికే గౌరారం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్నిపరిశీలించిన రైతు సంఘాలు ప్రతినిధులు, మల్లన్నసాగర్, టాంక్ బండ్‌, పంప్ హౌజ్‌ను పరిశీలించారు.. ఇవాళ జాతీయ రైతు సంఘం నేత టికాయ‌త్ స‌హా మ‌రి కొంత‌మంది నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు కేసీఆర్.. కేంద్ర ప్ర‌భుత్వ రైతు వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌ధానంగా ఈ భేటీలో చ‌ర్చించ‌నున్నట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో రైతు సంఘాల‌ను ఢిల్లీ నేత‌లు స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. అయితే, జాతీయ రాజ‌కీయాల్లోకి ప్రవేశిస్తున్నాం.. జెండా ఎత్తుతున్నాం అంటూ.. ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా.. కేసీఆర్‌ చెబుతూ వస్తున్నారు.. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నేతలతో స‌మావేశాలు నిర్వ‌హించ‌డంపై ఆసక్తిగా మారింది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, తెలంగాణలోని ప్రాజెక్టులను సందర్శించిన రైతులు.. మరోవైపు రాష్ట్రంలో అమలవుతోన్న రైతు సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణను అమలు పరుస్తున్న తెలంగాణ రాష్ట్రం వైపు రైతు ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తున్నది. రైతుబంధు ద్వారా పంటసాయం, రైతు కుటుంబాల్లో భరోసాను నింపే రైతు బీమాతో పాటు, 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు పుష్కలమైన నీరందించడంతోపాటు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయం పట్ల దేశ రైతాంగం ఆసక్తిని కనబరుస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు.. హైదరాబాద్‌ చేరుకుని.. ఆ తర్వాత.. వివిధ ప్రాజెక్టులను పరిశీలించారు.

మరోవైపు.. తెలంగాణలో అమలవుతోన్న రైతు సంక్షేమ పథకాలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. రైతు సంఘాల నేతలు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ రైతు నాయకుడు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎకరానికి రూ. 10 వేల రైతుబంధు సాయం, రూ. 5 లక్షల రైతు బీమా సాయం అందించడం దేశ రైతు చరిత్రలోనే గొప్ప పరిణామంగా పేర్కొన్నారు.. దేశ వ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు, సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడు అని కొనియాడారు రైతు సంఘాల నేతలు..

Show comments