CM KCR: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై సీఎం కేసీఆర్ మొదటి సంతకం చేశారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఇవాళ మధ్యాహ్నం 1:20 గంటలకు కొత్త సచివాలయ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ తూర్పు ద్వారం నుంచి సచివాలయంలోకి ప్రవేశించారు. గేటు దిగి సీఎం కేసీఆర్ కాలినడకన యాగశాలకు వెళ్లారు. తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం వద్ద సీఎం కేసీఆర్‌కు సీఎస్ శాంతికుమారి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన ద్వారం నుంచి నడిచారు.
Read also: Yadagirigutta: అలెర్ట్.. యాదాద్రి వెబ్‌సైట్, నిత్య కళ్యాణం సహా పలు సేవలు నిలిపివేత
సచివాలయ ప్రాంగణంలో జరిగిన యాగంలో కేసీఆర్ వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి బ్యాటరీ కారులో కేసీఆర్ సచివాలయాన్ని పరిశీలించారు. అనంతరం కేసీఆర్ ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు వెళ్లారు. కేసీఆర్ తన ఛాంబర్‌లో వేదపండితుల ఆశీస్సులు తీసుకున్నారు. కేసీఆర్ తన ఛాంబర్‌లో పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. రైల్వే మార్గదర్శకాల, పోడు భూముల ఫైల్లపై సీఎం సంతకం చేశారు. సుమారు ఆరు ఫైళ్లపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం యాదాద్రి కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించారు.