Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Ts Govt Will Be Released Rythu Bandhu Scheme

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ

Published Date :June 28, 2022 , 8:03 am
By NTV WebDesk
Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సాయం డ‌బ్బులు ఖాతాల్లో జ‌మ కానున్నాయి. తొలిరోజు ఎక‌రం భూమి ఉన్న రైతుల‌కు ఎప్ప‌టిలాగే పైస‌లు ప‌డ‌నున్నాయి. క్ర‌మ‌ప‌ద్ద‌తిలో రైతులంద‌రికీ జ‌మ చేయ‌నున్నారు. అయితే.. ఈ ఏడాది కొత్త‌గా 3064లక్ష‌ల మంది రైతుల‌కు రైతుబంధు సాయం అంద‌నుంది. అయితే గ‌త సీజ‌న్ తో పోల్చితే ల‌బ్దిదారులైన రైతుల సంఖ్య భారీగా పెర‌గ‌డంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ వానకాలం సీజన్‌కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా లెక్కతేల్చింది ప్రభుత్వం. అయితే రైతుబంధు పంపిణీ కోసం రూ.7,654.43 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ తెల‌ప‌డంతో.. 1.53 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం రైతుబంధు జమ చేయనుంది. ఇవాళ తొలిరోజైన మంగళవారం ఎకరం భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు రూ.586.65 కోట్లు ఖాతాల్లో జమ‌చేసేందుకు స‌ర్వం సిద్దం చేసింది.

అయితే వానాకాలం ప్రారంభం కాగానే రైతుబంధు సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు రైతన్న‌లు. కాగా రైతుల‌ను ఆశను వమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారం సీజన్‌ ప్రారంభ సమయంలోనే రైతుబంధు నిధులను అందించేందుకు ప‌కడ్బందీ ఏర్పాట్లు చేసింది. నేడు (మంగళవారం) నుంచి రైతుబంధు పైసలు జమవుతుండడంతో రైతుల్లో సంతోషం, క‌ళ్ల‌ల్లో ఆనందం కనిపించ‌నుంది. పెట్టుబడి భారం తీరిందనే భరోసా వారిలో కనిపించ‌నుంది. అయితే గ‌త ఏడాది సీజన్‌ వరకు రికార్డు స్థాయిలో రైతుబంధు కింద రూ. 50,448 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. కాగా.. ఈ సీజన్‌లో పంపిణీ చేయబోయే రూ. 7,654.43 కోట్లతో కలిపితే ఇప్పటివరకు రూ. 58,102 కోట్లకు అందించిన సాయం చేరనుంది.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీకి వ్యవసాయశాఖ తరుపున ఏర్పాట్లు పూర్తిచేశామని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. ఉదయం పూటే రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు జమయ్యేలా చర్యలు తీసుకొన్నాం. రైతులకు ఏమైనా సమస్యలుంటే స్థానిక ఏఈవోను కలిసి ఫిర్యాదు చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని రఘునందన్‌రావు ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • cm kcr
  • niranjan reddy
  • Rythu Bandhu scheme

తాజావార్తలు

  • Jubilant Food Works: బ్రెడ్ ముక్కతో వేల కోట్ల సామ్రాజ్యం.. ఏడాదికి రూ. 6900 కోట్ల లాభం! సక్సెస్ సీక్రెట్ ఇదే!

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

  • MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్‌ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions