CM KCR : రంగారెడ్డి జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు హరితోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో… దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హరితోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే తుమ్మలూరు అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్కలను నాటనున్నారు. ఏకకాలంలో 25వేల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా.. రహదారులు, కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు, తోరణాలు, ఆర్చీలతో తుమ్మలూరు ప్రాంతం గులాబీమయమైంది.
Also Read : Adipurush: రజినీ, మహేష్ రికార్డులు బ్రేక్… ఇప్పుడు ప్రభాస్ టాప్
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమం ఏర్పాట్లను నిన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, కలెక్టర్ హరీష్, సీపీ సత్యనారాయణ పర్యవేక్షించారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మొక్కలను నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
-
Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
-
UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్‌కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..