Site icon NTV Telugu

CM KCR : రంగారెడ్డి జిల్లాలో నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

Cm Kcr

Cm Kcr

రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు హరితోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో… దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హరితోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే తుమ్మలూరు అర్బన్‌ పార్కులో సీఎం కేసీఆర్‌ మొక్కలను నాటనున్నారు. ఏకకాలంలో 25వేల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా.. రహదారులు, కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు, తోరణాలు, ఆర్చీలతో తుమ్మలూరు ప్రాంతం గులాబీమయమైంది.

Also Read : Adipurush: రజినీ, మహేష్ రికార్డులు బ్రేక్… ఇప్పుడు ప్రభాస్ టాప్

ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమం ఏర్పాట్లను నిన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, కలెక్టర్ హరీష్, సీపీ సత్యనారాయణ పర్యవేక్షించారు. కాగా, 25 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మొక్కలను నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 40 రకాల మొక్కలను ఇప్పటికే అందుబాటులో ఉంచామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also Read : Maruti Swift CNG Price 2023: కేవలం 1 లక్ష చెల్లించి.. మారుతీ స్విఫ్ట్ సీఎన్‌జీని ఇంటికి తీసుకెళ్లండి! మైలేజ్ 30 కిమీ

Exit mobile version