NTV Telugu Site icon

వ్యాక్సినేష‌న్‌పై నిర్ణ‌యం.. కాసేప‌ట్లో కీల‌క భేటీ

KCR

వ్యాక్సినేష‌న్‌పై కీల‌క నిర్ణయం తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు… కాసేప‌ట్లో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.. ఈ స‌మావేశంలో.. వ్యాక్సినేష‌న్ ఎప్ప‌టి నుంచి తిరిగి ప్రారంభించాల‌న్న దానిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.. కాగా, వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా.. వ్యాక్సినేష‌న్ నిలిపివేసింది స‌ర్కార్.. టీకాలు వేయ‌డం నిలిచిపోయి కూడా పది రోజులు గ‌డిచింది… అయినా.. తిరిగి ఎప్ప‌టి నుంచి ప్రారంభం అవుతుంద‌న్న దానిపై క్లారిటీ లేదు.. కానీ, ఇవాళ ఆ తేదీని ఫైన‌ల్ చేసే అవ‌కాశంఉంది… మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేష‌న్ కు ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది.. ఈ జాబితాలో మీడియా, గ్యాస్ బాయ్స్, కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు త‌దిత‌రులు ఉండ‌బోతున్నార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల నిల్వ‌లు ఉన్నా.. ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిలిపివేశార‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.