సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. అయితే.. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో నేరుగా కేసీఆర్ ఢిల్లీలో ఉంటూ బీజేపీపై యుద్ధం తీవ్రతరం చేయడంపై ఆయన ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో.. భాగంగా జాతీయ రాజకీయాలపై పలువురు సీనియర్ నేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగాల్సిన సందర్భంలో కొంత మంది విపక్ష నేతలు ఓటింగ్ కు దూరం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే.. 2022 ఫిబ్రవరి 28న తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెల్లిన విషయం తెలిసిందే. 3 రోజులపాటు సీఎం కేసీఆర్ అక్కడే ఉన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర చేపట్టేందుకు పూర్తి స్కెచ్‌తో కేసీఆర్ రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, సినిమా నటుడు ప్రకాశ్ రాజ్‌ను కూడా కలిశారు సీఎం. ఈనేపథ్యంలో.. బీజేపీకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని.. అనేక లోకల్ పార్టీల నాయకులతోనూ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు రాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన తమిళిసై, పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశముందని సమాచారం. ఈనేపథ్యంలో.. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ పర్యటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.