సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. అయితే.. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో నేరుగా కేసీఆర్ ఢిల్లీలో ఉంటూ బీజేపీపై యుద్ధం తీవ్రతరం చేయడంపై ఆయన ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో.. భాగంగా జాతీయ రాజకీయాలపై పలువురు సీనియర్ నేతలతో…