Site icon NTV Telugu

CM KCR: తెలంగాణను ఎగతాళి చేసిన వారికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ..

Cm Kcr Harish Rao

Cm Kcr Harish Rao

CM KCR: దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్‌ సాక్షాత్తు ప్రారంభించారు. తెలంగాణ నుంచి ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. బోధనా కాలేజీలే కాదు, వాటికి అనుబంధంగా ఆస్పత్రులు కూడా ఉంటాయన్నారు. రాష్ట్రంలో 50 వేల పడకల్ని ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చుకున్నాని తెలిపారు. 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు, పారామెడికల్ కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు సీఎం తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతికుమారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైద్యఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కనీసం 15-20 వేల మందితో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు అదనంగా అందుబాటులోకి రానున్న దవాఖానతో విద్యార్థులకే కాకుండా ప్రజలకు కూడా అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయని తెలిపారు.

కేవలం కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే అందుబాటులో ఉండే ప్రపంచ స్థాయి రోబోటిక్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్, ఎంఎన్‌జే డిస్పెన్సరీలకు విస్తరించింది. తద్వారా పేద ప్రజలకు నాణ్యమైన, అధునాతన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. నిమ్స్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇటీవల రూ.156 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో గుండెకాయ లాంటి హైదరాబాద్ వాసుల వైద్య అవసరాలను తీర్చేందుకు జీహెచ్ ఎంసీ పరిధిలోని 6 జోన్లకు 6 డీఎంహెచ్ ఓ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. గాంధీలో సంతానోత్పత్తి కేంద్రం, అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గాంధీ, నిమ్స్‌, అల్వాల్‌లో సూపర్‌స్పెషాలిటీ ఎంసీహెచ్‌లు నిర్మాణంలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ ను అధునాతన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చి మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషం.
Medak: చేతబడి అని అనుమానం.. చెట్టుకు కట్టేసి చితకొట్టిన గ్రామస్తులు

Exit mobile version