NTV Telugu Site icon

CM KCR: కేంద్ర ప్రభుత్వ కుట్రల వల్లే దేశంలో నీటి యుద్ధాలు

Cm Kcr Bhadradri Speech

Cm Kcr Bhadradri Speech

CM KCR Speech In Bhadradri Kothagudem Public Meeting: దేశంలో నదీజలాల కోసం రాష్ట్రాల మధ్య యుద్ధం జరుగుతోందని.. కేంద్ర ప్రభుత్వ కుట్రల వల్లే ఈ నీటి యుద్ధాలని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న అత్యధిక భూమి మన దేశంలోనే ఉందన్నారు. కానీ.. దేశం వాడుకుంటోంది కేవలం 20 శాతం నీటిని మాత్రమేనని, 70 శాతం నీరు వృధాగా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో తాగునీటిని కల్పించలేని స్థితిలో దేశం ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే సరైన తాగునీటి వ్యవస్థ లేదన్నారు. విద్యుత్ ఉత్పాదనలోనూ దేశం వెనుకంజలో ఉందన్నారు. కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడం వల్లే.. ఛత్తీస్‌ఘడ్‌లో వేల మెగావాట్ల హైడ్రో విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయని ఆరోపించారు. దేశాన్ని రక్షించుకోవాలంటే.. రాబోయే రోజుల్లో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Pak Embassy: మహిళా ప్రొఫెసర్‌తో పాక్ ఎంబసీ అసభ్య ప్రవర్తన.. భారత్‌కు వ్యతిరేకంగా రాయాలని డిమాండ్

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సువిశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టరేట్‌ను నిర్మించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇకపై జిల్లా ప్రజలకు మంచి పరిపాలన అందాలని ఆకాంక్షించిన ఆయన.. కొత్తగూడెంకు నూతన కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, థర్మల్ ప్లాంట్ వచ్చాయన్నారు. సిరుల తల్లి సింగరేణికి నిలయం ఇల్లందు, కొత్తగూడెం గడ్డ అని.. ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులని కొనియాడారు. ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లా జైలులో ఉన్నప్పుడు.. ఈ ప్రాంత ప్రజలే తనని కాపాడారని గుర్తు చేసుకున్నారు. రాదేమో, సాధ్యంకాదేమో, అసంభవమేమోనన్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. కాళేశ్వరమే కాదు.. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఇంచుకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే.. జిల్లా సస్యశ్యామలం అవుతోందన్నారు. 37 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ ప్రాజెక్టును ఇప్పటికే చేపట్టామని.. మనిషి పుట్టుకు నుంచి మరణం వరకు ప్రతి ఒక్కరిని ఏదో ఒక సంక్షేమ పథకంలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలియజేశారు.

Rotten Coconut Business: బుర్రుండాలే కానీ.. తేలిగ్గా బిలియనీర్ కావొచ్చు

ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వినతి మేరకు కొత్తగూడెం ముర్రేడువాగు కోతలపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలకు.. గ్రామానికి పది లక్షలు చొప్పున మంజూరు చేశారు. జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడెం మున్సిపాలిటీలకు 80 కోట్లు.. ఇతర మున్సిపాలిటీలకు 20 కోట్లు మంజూరు చేశారు. పాల్వంచ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్‌కు కావాల్సిన నూతన వసతి గృహాలను సైతం మంజూరు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అనతికాలంలోనే తెలంగాణ జీడీపీ గణనీయంగా పెరిగిందని.. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే దేశవ్యాప్తంగా జీడీపీ తగ్గుతోందని ఆరోపించారు. మత విద్వేషాలతో దేశాన్ని అశాంతికి గురిచేస్తే.. జీడీపీ పెరగదన్నారు. ప్రగతిశీల విధానాలతో ముందుకుపోయేదే గొప్ప పార్టీ అని, దేశపురోభివృద్ధే మన పురోగతి అని కేసీఆర్ ఉద్ఘాటించారు.

Mallu Ravi: వార్ రూమ్ కేసు విచారణ.. సంక్రాంతి తర్వాత వస్తానన్న మల్లు రవి