Buddha Purnima: బుద్ధుని బోధనలను స్మరించుకున్న కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఆయన బోధనలను స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని పేర్కొన్నారు.. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధానకేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లిందని.. కృష్ణానది ఒడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జునసాగర్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని గుర్తుచేశారు.
బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనున్నదన్నారు సీఎం కేసీఆర్.. సర్వ జన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుని మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తున్నదని తెలిపారు. కాగా, నాగార్జున సాగర్‌లో నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం గత వారం నుంచి అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ బద్ధవనాన్ని ప్రారంభించారు. 247 ఎకరాల్లో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది బౌద్ధక్షేత్రం.. నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో 2003 సంవత్సరంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.42 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించినా.. 2014 వరకు నిధుల కొరతతో పనులు అంతంత మాత్రంగానే సాగాయి.. 2015లో రూ.25కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వడివడిగా పనులు సాగించింది.. మరికొన్ని నిర్మాణాలు చేయాల్సి ఉన్నా.. గత శనివారం ఆ క్షేత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
తాజావార్తలు
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!