CM KCR : భట్టి గారికి ప్రమోషన్ ఇవ్వాలి
CM KCR Praised CLP Leader Mallu Bhatti Vikramarka at TS Assembly Budget Sessions.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మన ఊరు.. మన బడిపై చేసిన వ్యాఖ్యాలకు సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే యువ నాయకులు సభలో ఉన్నారన్నారు. సభలో చర్చ బాగా జరగాలని, బడ్జెట్ అంటే బ్రహ్మ పదార్థం అన్న అభిప్రాయం దేశంలో ఉందని, బడ్జెట్లో పస లేదు… అని ఎదుటోల్లు అనడం ఆనవాయితీ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘భట్టి గారు మన ఊరు మన బడి మంచిది అని చెప్పారు.. భట్టి గారికి ఈ సారి ఓ మంచి మాట చెప్పారు.. భట్టి గారికి ప్రమోషన్ ఇవ్వాలి.. పార్లమెంట్ కి పంపాలి’ అని అన్నారు. కేంద్రం విషయాలు ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నారని, అందుకే పార్లమెంట్ కి పంపాలి అంటున్నామన్నారు.
Also Read
- Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
- Telangana Vahan Portal: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన వాహన్ పోర్టల్.. ఇక మీ ఇంటి నుంచే వాహన సేవలు!
- Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్‌కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
అప్పులు కాదు… వనరుల సమీకరణ గా చూడాలని, కరప్షన్ అనిచివేశామని, రైతు బంధులో 50 వేల కోట్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. సంస్కార వంతమైన ఆర్ధిక క్రమశిక్షణలో తెలంగాణ ఉందని, మనకంటే ఎక్కువ అప్పులు తెచ్చే రాష్ట్రాలు ఉన్నాయని, అప్పులు తీసుకోవడంలో మనం 25వ స్థానంలో ఉన్నామన్నారు. అప్పుల విషయంలో ఆందోళన అక్కర లేదని, బలమైన కేంద్రం, బలిహీన రాష్ట్రం ఉండాలన్నది ఇప్పటి వాళ్ళ ఆలోచన అని, ఇది అప్రజాస్వామిక చర్య అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం అనే ధోరణి ఇప్పటి కేంద్రం చేస్తుందని, దుర్మార్గ ఆలోచన ఇది అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం పనితీరు కంటే…మనమే మెరుగ్గా ఉన్నామని, దేశం అప్పు 152 లక్షల కోట్లు అని, రాష్ట్రానికి 25 శాతం అప్పుల పరిమితి విధించారని, రాష్ట్రంకి పెట్టిన పరిమితి కేంద్రంలో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
-
Raghav chadha: సీఏ నుంచి ఆప్‌ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
-
Raghav Chadha: ఆప్‌లో భారీ చీలిక.. పంజాబ్‌లో ‘మాన్’ ప్రభుత్వం కూలిపోతుందా!
-
Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!