NTV Telugu Site icon

Telangana Floods: మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

Kcr Indrakaranreddy

Kcr Indrakaranreddy

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంట‌ల్లో ప‌రిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వర‌ద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మ‌రో 24 గంట‌ల పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. హెలీపాడ్ ల‌ను సిద్ధంగా ఉంచాలన్నారు.

అయితే.. పది రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు జిల్లా రైతాంగం చావు దెబ్బతింది. జిల్లాలో ప్రధాన పంటలన్నీ భారీ విస్తీర్ణంలో తుడిచి పెట్టుకపోయాయి. జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాలకుపైగా పత్తి పంట నీటి మునిగి మొక్కలు చనిపోగా మరో 12వేల ఎకరాల్లో కంది, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది రైతులు ప్రభుత్వ చేయూత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే వర్షాలు కురియడంతో రైతాంగం కోటి ఆశలతో ఉత్సాహంగా పత్తి పంట సాగు చేపట్టింది. ఇక మొక్కలు మొలచి ఏపుగా పెరుగుతున్నాయనుకుంటున్న దశలో అతి వృష్టి కారణంగా రైతులు ఒక్కొక్క ఎకరాపై రూ.15వేలకుపైగా నష్ట పోయారు. ఈనేపథ్యంతో.. మళ్లీ పంటలు నాటే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు.

Prabhas New Movie : మారుతితో సినిమాకు సిద్ధమవుతున్న డార్లింగ్‌

Show comments