తెలంగాణ రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రమంతా ఒకేసారి ప్రజల జాతీయగీతాలాపనతో నగరమంతా పండుగ వాతావరణ కనిపించింది. ఉదయం 11.30 గంటలకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి, పనిచేస్తున్న ప్రదేశంలో.. బస్సుల్లో, మెట్రో రైలు లో నిలబడి గీతాలాపన చేసారు. సామూహిక జాతీయ గీతాలాపనతో నగరంలో అన్ని కూడళ్ళలో సందడి వాతావరణం నెలకొంది. జాతీయ జెండాలు తో ర్యాలీగా వచ్చిన విద్యార్థులు. అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విజయవంతం చేశారు.
సిద్దిపేట జిల్లాలో సామూహిక జాతీయ గీతాలపన నిర్వహించారు. నర్సాపూర్ లో ఒకే తటిచెట్టుపైకి జాతీయ జెండాలతో ఎక్కిన 20 మంది గీతా కార్మికులు జాతీయ జెండాను చేతబూని తమ దేశభక్తిని చాటుకున్నారు. చెట్టుపైనే జాతీయ గీతాలాపన చేసారు. జిల్లాలోని పంట పొలాల్లో జాతీయ గీతాలపన నిర్వాహించారు పలువురు. పొలంలోనే జాతీయ జెండాలు సెల్యూట్ చేస్తూ.. జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని చాటారు.
ఎన్టీవీ కార్యాలయంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యాలయంలో టీం మెంబర్స్ పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో కూడా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. సామూహిక జాతీయ గీతాలాపనలో బండి సంజయ్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక సికింద్రబాద్ గాంధీ ఆసుపత్రిలో సైతం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో.. పేషంట్లు సైతం నిలబడి జాతీయ గీతాలాపన చేయడం అందరిని ఆకట్టుకుంది. హైటెక్ సిటీ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతపట్టి షెల్యూట్ కొడుతూ జాతీయ గీతాలాపణ చేసారు.
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని జనగణమన పాడిన ఈటెల రాజేందర్ షామీర్పేటలోని తన నివాసంలో ఈటెలకు కలవడానికి వచ్చిన నాయకులుచ అభిమానులతో కలిసి జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సామూహిక జాతీయ గీతాలాపన కోసం పలు చోట్లు నుంచి వచ్చిన వారికి, అక్కడ నుంచి నిలిపివేసిన, ట్రాఫిక్ మళ్లింపు చేసిన ట్రాఫిక్ నుంచి క్లియర్ చేయడానికి సమయం పట్టే విధంగా వుందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సాధారణ పరిస్థితి కి రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం వున్నందున ప్రయాణికులు సహకరించాలని కోరారు.
