హైదరాబాద్‌లోని పీవీమార్గ్‌లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఆవిష్కరించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అంగరంగవైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ గురించి కొన్ని విషయాలను పేర్కొన్నారు. పీవీ శతజయంతి వేడుకలు నేటితో ముగుస్తున్నాయని, ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పీవీ ఒక కీర్తి శిఖరం అని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నసమయంలో నవోదయ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ విద్యాసంస్థలు ఎంతగా అభివృద్ది చెందాయో చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
Read: దిశా పఠానీ ‘బంతాట’! ‘వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్’ అంటోన్న హాట్ గాళ్…
పీవీ ఓ విద్యానిధి అని, సాహిత్యపెన్నిధి అని అన్నారు. పీవీ అనేక రచనలు చేశారని, పీవీ ఓ సంస్కరణశీలి అని, సంస్కరణ శీలురే అభ్యుదయ తరానికి బాటలు వేయగలరని తెలిపారు. భూసంస్కరణలు పటిష్టంగా అమలు చేసిన వ్యక్తి పీవీ అని అన్నారు. అదేవిధంగా 800 ఎకరాల సొంత భూమిని పంచిన గొప్ప వ్యక్తి పీవీ అని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న రోజుల్లోపీవీ సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పీవీ పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని, పీవీ విద్యాపీఠం చాలా గొప్పగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
