Site icon NTV Telugu

సీఎం కేసీఆర్‌కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి దూరం

ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. ముందుగా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ కూడా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు జ్వరం కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది. కేసీఆర్‌కు జ్వరంగా ఉందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగే రామానుజచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

Read Also: చలితో వణుకుతున్న తెలంగాణ .. ఆదిలాబాద్ లో అత్యల్పం

కాగా ప్రధాని మోదీకి సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ, మంత్రి తలసాని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. వీఐపీ గేట్ నుండి సీఎస్, డీజీపీలను పోలీసులు అనుమతించకపోవడంతో వాళ్లు మరో గేట్ నుంచి విమానాశ్రయం లోపలకు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రధాని మోదీ ఇక్రిశాట్‌కు చేరుకున్నారు. ఇక్రిశాట్‌లో స్వర్ణత్సోవాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం ముచ్చింతల్‌లోని సమతా మూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ రానున్నారు.

Exit mobile version