NTV Telugu Site icon

CM KCR : హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌..

Kcr

Kcr

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు తెలంగా సీఎం కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 20 జాతీయ పర్యటనకు వెళ్లారు. అయితే ఆయన పర్యటన ఈ నెలాఖరు వరకు కొనసాగిల్సి ఉండగా మధ్యలోనే తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 20న ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఈ నెల 21న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయ్యారు.

ఈ నెల 22న ఢిల్లీ సీఎం కేజీవాల్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అంతేకాకుండా సమావేశం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు వారి బృందాలతో చండీగడ్‌కు వెళ్లారు. జాతీయ రైతు ఉద్యమంలో మరణించిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేలా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. 24, 25 తేదీల్లో పలువురు ప్రముఖులతో చర్చలు, భేటీలు జరగాల్సి ఉన్నా… సీఎం వాటిని వాయిదా వేసి హైదరాబాదు తిరిగి వచ్చేశారు.

మంగళ, బుధవారాల్లో సమావేశాల నిర్వహణతో పాటు కొందరు సన్నిహితుల కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 25న బెంగళూరు వెళ్లనున్న కేసీఆర్‌.. అక్కడ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ కానున్నారు. 27న మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధికి వెళ్లి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అదే రోజు షిరిడి పుణ్యక్షేత్రం వెళ్లి సాయిబాబాను దర్శించుకుని, మళ్లీ హైదరాబాద్‌కు చేరుకుంటారు.