NTV Telugu Site icon

CM KCR: ప్రగతి భవన్‌ లో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ తో సీఎం కేసీఆర్ భేటీ.. విద్యార్థుల్లో ఉత్కంఠ

Cm Kcr

Cm Kcr

CM KCR: Tspsc పేపర్ లీక్ తెలంగాణలో హాట్‌ టాపిక్‌ గా మారి ఇది కాస్తా రాజకీయం పులుముకుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం దాని తర్వాత పలు పోటీ పరీక్షలు రద్దు చేయడం జరగడంతో తీవ్ర దుమారం రేపింది. పేపర్‌ లీక్‌ పై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదంటూ పలు ప్రశ్నలు ,ప్రతిపక్షాలు విమర్సలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు పరీక్షల రద్దుతో ఉద్యోగార్థులు కూడా తీవ్ర గందరగోళం ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కీలక సమావేశం ఏర్పాటు చేసారు. దీనికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ జనార్ధన్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ అధికారులతోపాటు మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ కూడా ఈ సమావేశంలో ఉన్నారు.

Read also: Minister KTR: తెలంగాణలో కైటెక్స్‌ గార్మెంట్స్‌ తొలి యూనిట్‌

కాగా.. ఈ కీలక భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే గ్రూప్‌ వన్ పరీక్ష రాసి వేల మంది అభ్యర్థులు తర్వాత దశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. కాగా.. లీకేజీతో సంబందం లేకుండా రాత్రిపగలు చదివి మంచి మార్కులు తెచ్చుకొన్ని అర్హత సాధించిన వాళ్లుు ఉన్నారు. అయితే.. ఇప్పుడు పరీక్ష రద్దుతో వాళ్లు కూడా నష్టపోయారు. ఇలా చాలా మందికి అన్యాయం జరగుతుంది. అటువంటి వారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వనుంది అనేది ఇప్పుడు ముందున్న టాస్క్ గా మారింది. ఈనేపత్యంలో.. ఒకసారి లీకేజీ ఆరోపణలు వచ్చిన తర్వాత భవిష్యత్‌లో ఎలాంటి లీకేజీ బెడద లేకుండా తీసుకునే చర్యలపై కూడా చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్పటికే పరీక్ష విధానంపై చాలా అయోమయం ఉన్న టైంలో ఒక్కరు చేసిన తప్పునకు లక్షల మంది బలి అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కావున మరోసారి ఇలాంటివి రీపీట్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన బాధ్యత, దానిపై ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. మరి దీనిపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ ఏం చెప్పనున్నారనే దానిపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Actress Himaja: నన్ను ఇబ్బందులు పెట్టారు, ఘోరంగా ఏడ్చాను.. హిమజ షాకింగ్ కామెంట్స్

Show comments