KCR Maharashtra Tour: సీఎం కేసీఆర్ ఉదయం 8 గంటలకు పండరీపురం వెళ్లనున్నారు. అక్కడ రుక్మిణి సమేతంగా విఠేశ్వరస్వామిని పూజిస్తారు. ఆ తర్వాత షోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. సీఎం సమక్షంలో జిల్లా నేత భగీరథ బాల్కేతోపాటు పలువురు నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆ తర్వాత ధరాశివ్ జిల్లాలోని శక్తివంతమైన ఆలయమైన తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు ఉన్నారు.
Read also: Rain Forecast: రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి రథం 600 కార్ల కాన్వాయ్‌తో సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ నుంచి రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్ బయలుదేరారు. ధారశివ్ జిల్లా ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం సాయంత్రం షోలాపూర్ చేరుకున్న ముఖ్యమంత్రికి బీఆర్‌ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కాగా.. ఉదయం 10:50 గంటలకుకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ‘మహా’యాత్ర సాయంత్రం 4:17 గంటలకు సోలాపూర్ చేరుకోవటంతో ముగిసింది. షోలాపూర్ చేరుకున్న కేసీఆర్ స్థానిక నేత, మాజీ ఎంపీ ధర్మాన ముండయ్య సాదుల్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. షోలాపూర్‌లో తెలుగు వలసదారులు, తెలంగాణ నుంచి ఇక్కడ స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో ఉండగా, వారంతా సీఎం కేసీఆర్‌తో తెలుగులో మాట్లాడారు. షోలాపూర్ కు కేసీఆర్ రావడం సంతోషంగా ఉందని, ఇక్కడ బీఆర్ ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. స్థానిక రాజకీయాలపై ధర్మన్నతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు.
Aviation Industry: పెరుగుతున్న ప్రయాణికులు.. మూతపడుతున్న విమాన సంస్థలు
