NTV Telugu Site icon

Godavari Floods: భద్రాచలానికి ముప్పు..! సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

Kcr

Kcr

గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరిలో నీటి ఉధృతి పెరుగుతోంది.. గోదావరి పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి.. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ఇప్పటికే 70 అడుగులకు చేరువైంది.. మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.. భద్రాచలానికి వెంటనే హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామగ్రి తరలించండి అంటూ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో, ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వరదముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములు అవుతున్నారు.

Read Also: Somu Veerraju: పోలవరం ప్రాజెక్టుకు మేం బాకీలేం.. చర్చకు సిద్ధం..

ఈ నేపథ్యంలో.. ఊహించని వరదలకు జలమయమవుతోన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని, రెస్క్యూ టీమ్‌లు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే అప్రమత్తంగా ఉంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగా కాపాడుతున్నది. భద్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్… దాంతో పాటు వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగ పడే లైఫ్ జాకెట్లు, తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.