Site icon NTV Telugu

CM KCR Key Meeting: 10న కేసీఆర్‌ కీలక సమావేశం..

Cm Kcr

Cm Kcr

CM KCR Key Meeting: ఎల్లుండి తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌ జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన.. ఈ సమావేశం జరగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో.. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ కార్యకలాపాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాలు.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఇక, ఆహ్వానితులు ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. కేసీఆర్‌ నిర్వహించనున్న ఈ కీలక భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. తాజా పరిస్థితులు.. అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చ సాగే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Exit mobile version