NTV Telugu Site icon

CM KCR: సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..? టాప్‌లో జగన్ మోహన్ రెడ్డి

Kcr Jagan

Kcr Jagan

CM KCR: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మొదటిస్థానంలో నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన దాని ప్రకారం సీఎం ఆస్తుల్ని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ అండ్‌ నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రూ.510 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది. దేశంలో అతి తక్కువ ఆస్తులు రూ. 15 లక్షలు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.

Read Also: GT vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్

ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు రూ.8 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం ఆస్తుల్లో జగన్ తర్వాతి స్థానంలో రూ.163 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండోస్థానంలో, రూ. 63 కోట్లతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ నివేదికలో మమతా తప్పితే అందరు ముఖ్యమంత్రుల ఆస్తులు ఒక కోటికి పైగానే ఉన్నాయి. కోటి విలువైన ఆస్తులతో హర్యానాకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కేరళకు సీఎం పినరయి విజయన్‌లు మమతా బెనర్జీతో కలిసి చివరి మూడు స్థానాలను పంచుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆస్తులు రూ. 4 కోట్లు కాగా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆస్తులు రూ. 3 కోట్లుగా నివేదిక వెల్లడించింది. మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. సీఎంలలో 11 మంది గ్రాడ్యుయేట్లు కాగా, 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్టు, నలుగురు ప్రొఫెషనల్ డిగ్రీలు, ఒకరు డాక్టర్ డిగ్రీని కలిగి ఉన్నారు. ఒక సీఎం కేవలం 10 పాస్ కాగా, మిగిలిన ముగ్గురు కేవలం 12 వ తరగతి ఉత్తీర్ణులు ఉన్నారు.