Site icon NTV Telugu

CM KCR LIVE: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం లైవ్‌ అప్‌డేట్స్‌

Kcr

Kcr

అడుగడుగునా నిఘా పెట్టి.. అనుక్షణం పహారా కాస్తూ నగరవాసికి భద్రతా ఛత్రంగా నిలిచే పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకల హంగులతో బంజారాహిల్స్‌ రోడ్డు నెం.12లో సర్వాంగ సుందరంగా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.. ఇప్పుడా కార్యక్రమానికి లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=bUStXT8OE5g

The liveblog has ended.
  • 04 Aug 2022 04:23 PM (IST)

    సైబర్ క్రైమ్.. ప్రధాన సమస్య

    హ్యూమన్ కమ్యూనిటీ భూమ్మీద ఉన్నంత కాలం పోలీసింగ్ వ్యవస్థ ఉంటుంది.కమాండ్ కంట్రోల్ సెంటర్ అవశ్యకత గురించి డీజీపీ మహేందర్ రెడ్డి వివరించేవారు.మహేందర్ రెడ్డి ఈ CCC బిల్డింగ్ రూపల్పన చేశారు..ఆయన ఆలోచన మేరకే ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది..రెండు సంవత్సరాల క్రితం ఈ భవనం పూర్తి కావాల్సి ఉండింది..కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది.పోలీసులు అధికారుల్లో ఉన్న గొప్ప కౌసల్యం ఓర్పు నేర్పు.

    చేయాలి ఆన్న చిత్తశుద్ది ఉంటే తప్పకకుండ గమ్యం చేరుకోవచ్చు. అందుకు ఉదాహరణ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్. CCC పైకి వెళ్లి చూస్తున్నపుడు చాలా సంతృప్తి ఇచ్చింది..మాజీ DGP లను, పోలీస్ శాఖలో సేవలు అందించి రిటైర్డ్ అయిన వారిని ఆవ్యానించాలి వారికి CCC లో కలియ తిరిగే అవకాశం కల్పించాలి. వారు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుని ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేయాలి. విధి నిర్వహణలో అపార అనుభవం ఉంటుంది కాబట్టి వారి సలహాలు తీసుకోవాలి.

    ప్రపంచం మొత్తం నీ కుదిపేస్తున్న అంశం సైబర్ క్రైమ్. ఇది క్రిటికల్ సబ్జెక్ట్... రాష్ర్టంలో సైబర్ క్రైమ్ అరికట్టడానికి డీజీపీ కి ఓ సూచన చేశాను..ఒక డీజీనీ గానీ అడిషనల్ డీజీ నీ గానీ పెట్టీ అధ్యయనం చేయాలి అని చెప్పాను..డ్రగ్స్ సమాజం జీవికను శాసించే భయంకర విషయం..ఆటం బాంబు లాంటిది ఈ డ్రగ్స్.. వీటి నిర్మూలనకు కృషి చేయాలి..తెలంగాణ పోలీసులు దేశంలో మొదటి స్థానం అని పేరు తెచ్చుకునేలా పని పని చేయాలి. డిసెంబర్ దాకా డీజీపీ సర్వీస్ ఉంది.. మారేది అయన యూనిఫాం మాత్రమే.

    రిటైర్డ్ అయిన కూడా మహేందర్ రెడ్డి గారి సేవలు కొనసాగాలి... వినియోగించుకుంటాం.. ఆయన్ను వదులు కోము..సింగపూర్ లో అర్ధరాత్రి కూడా మహిళలు నిర్భయంగా వారి పనులు చేసుకుంటున్నారు..సింగపూర్ పర్యటన కు వెళ్ళినపుడు ఈ విషయం మాకు అర్థం అయింది..

    హైదరాబాద్ లో నేరాల స్వరూపం మారుతోంది..నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నారు..అద్భుతమైన రీతిలో తెలంగాణ పోలీసుల పని తీరు ఉంది..ద్విగునికృతమైన ఉత్సాహంతో పోలీసులు ముందుకెళ్లాలి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.ఫ్రెండ్లీ పోలీసింగ్, సంస్కారం వంతమైన పోలీసింగ్ వ్యవస్థ నిర్మాణం అవ్వాలి..పోలీసులు పాత పద్దతిలో కాకుండా మెరుగ్గా పని చేసేలా ఏం చెయ్యలో ఆలోచించాలి.సంకల్పమ్ తీసుకుంటే ఏదైనా సాధ్యమే.సంకల్ప బలానికి ప్రతీక ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్..గుడుంబా, పేకాట, తదితర జాడ్యాలను నిర్మూలించడలో పోలీసులు కీలక పాత్ర పోషించారు.

  • 04 Aug 2022 03:26 PM (IST)

    కాంగ్రెస్ నాయకుల నిరసన గళం

    పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఆందోళన చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. డబుల్ బెడ్ రూం నివాసాలు నిర్మాణం చేయకుండా పేద ప్రజలను మభ్యపెడుతూ ఇంకెంతకాలం మోసం చేస్తారని టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ రోహిన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పోలీసుల కోసం భారీ భవనాలు నిర్మించి అహో ఓహో అంటూ గొప్పలు పోతున్నారని కానీ పేద ప్రజలను మాత్రం డబుల్ బెడ్ రూం నివాసాలు అంటూ హామీలు ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చాలా రోజుల నుంచి డబల్ బెడ్ రూమ్ ల ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అంటే ఈ పథకం కూడా ఎత్తేసినట్లేనా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కట్టిన డబుల్ బెడ్ రూములు కూడా నాణ్యత లేదని అన్నారు. డబల్ బెడ్ రూమ్ లో విషయంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా ఇలా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తే ప్రగతి భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు.

  • 04 Aug 2022 03:24 PM (IST)

    దేశం గర్వించేలా CCC .. తెలంగాణకే గర్వ కారణం

    2014 లో సికింద్రాబాద్ లో జూన్ 2 న కెసిఆర్ కమాండ్ కంట్రోల్ ఆలోచన చెప్పారు. పోలీస్ శాఖ కు మేం అడగకపోయినా ప్రభుత్వ అధినేతగా ప్రతి సారి పోలీస్ శాఖ కి మేలు చేశారన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ కి ఎప్పుడు అండగా ఉన్నారు. 8 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక బాధ్యత నిర్వహించింది. నేను హైదరాబాద్ సీపీ గా ఉన్న సమయంలో విదేశీ పోలీసింగ్ గురించి తెలుసుకోవాలని సీఎం అక్కడికి పంపించారు.

    విదేశాల్లో పోలీసింగ్ విధానం పై పూర్తి అధ్యయనం చేశాం. నేరాలు చేసే వారు కొత్త కొత్త టెక్నాలజీ వాడుతున్నారు.వారి కంటే రెండు అడుగులు ముందు గానే మనం ఉండాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వరల్డ్ క్లాస్ సదుపాయాలు ఉన్నాయి. ఈ CCC నుండి ప్రభుత్వ విభాగాలు సమిష్టిగా పని చేయవచ్చు. ప్రపంచం లో ఇటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లేదు. గ్రామాలు, పోలీస్ స్టేషన్ లు, వివిధ విభాగాల కమాండ్ సెంటర్ లు అన్నిటికీ ఈ CCC హబ్ లాంటిది. పోలీస్ శాఖ లో ఉన్న అన్ని విభాగాలతో ఈ CCC ను అనుసంధానం చేస్తాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రజలకు భరోసా ఇస్తోంది. ఇంత మంది సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు డీజీపీ.

  • 04 Aug 2022 02:45 PM (IST)

    సీసీసీలో కేసీఆర్‌కు ప్రత్యేక ఛాంబర్..

    ఇవాళే పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక, ఆయనకు సీసీసీలో ప్రత్యేక ఛాంబర్ కూడా కేటాయించారు.. ఇవాళ ప్రత్యేక ఛాంబర్‌లో కాసేపు కూర్చున్నారు సీఎం కేసీఆర్

  • 04 Aug 2022 02:08 PM (IST)

    ప్రత్యేక పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్

    పోలీస్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, గాంధీ, హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, డీజిపి మహేందర్ రెడ్డి, సీపీ సీని ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు.. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి

  • 04 Aug 2022 01:38 PM (IST)

    శాంతి భద్రతలకు వెన్ను దన్నుగా

    శాంతి భద్రతల పోలీసులకు సీసీసీ వెన్ను దన్నుగా నిలుస్తుంది. సీసీ కెమెరాలు ఒకే చోట ఉండటం, ఎక్కడైనా.., ఏదైనా ఘటన జరిగిందంటే వెంటనే సీసీసీ నుంచి స్థానిక పోలీసులకు కావాల్సిన సమాచారం ఇక్కడి నుంచి అందుతుంది. సీసీ కెమెరాల విశ్లేషణ చేస్తారు. కిడ్నాప్‌, ఇతరత్రా నేరాలు చేసి పరారవుతున్నారంటే వెంటనే మూడు పోలీస్‌ కమిషనరేట్ల పోలీసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు సీసీసీ నుంచి సందేశాలు వెళ్తాయి.

  • 04 Aug 2022 01:38 PM (IST)

    సోషల్‌ మీడియాకు ప్రత్యేక వింగ్‌

    సోషల్‌మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, పుకార్లు కొన్నిసార్లు ప్రజలను భయాందోళన కల్గించేవిధంగా ఉంటాయి. వర్గాలు, వ్యక్తుల మధ్య గొడవలు సృష్టించేవిగా ఉంటాయి. ఇలాంటి పోస్టులతో ప్రశాంతతకు భంగం కల్గుతుంది. సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించే వారు అధికంగా ఉన్నారు. అలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు సీసీసీలో కొత్తగా సోషల్‌మీడియా విభాగాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వింగ్‌ సోషల్‌మీడియాలో వచ్చే పోస్టులను ఎప్పకటిప్పుడు స్క్రూటినీ చేస్తూ ఉంటుంది.

  • 04 Aug 2022 01:38 PM (IST)

    కాయిన్‌ బాక్స్‌తో కాల్స్‌

    ఎమర్జెన్సీగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే అలాంటి వారి సమస్యలను తెలుసుకోవడం కోసం నగరంలో ఎమర్జెన్సీ కాయిన్‌ బాక్స్‌లు ఉన్నాయి. కాయిన్‌ బాక్స్‌ల మాదిరిగా ఉంటూ ఫోన్‌తో వీడియోకాల్‌ చేసే అవకాశముంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఫోన్‌ బాక్స్‌ వద్దకు వెళ్లి సీసీసీకి ఫోన్‌ చేయవచ్చు. పోలీసులు కూడా ఎక్కడి నుంచి కాల్‌ వచ్చిందనే సమాచారం తీసుకొని, నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు వెళ్లి తగిన సహాయం చేస్తారు.

  • 04 Aug 2022 01:37 PM (IST)

    ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు

    మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 250 ఏఎన్‌పీఆర్‌ (ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(సీసీసీ)కు అనుసంధానమై ఉంటాయి. సాధారణ కెమెరాలతో పాటు ఈ కెమెరాలను సీసీసీకి అనుసంధానం చేస్తారు. ట్రాఫిక్‌ రద్దీ ఎలా ఉంది..? ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడటానికి కారణాలేమిటి..? ఎంత సేపట్లో ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ అవుతుందనే విషయాలతో పాటు ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలు, అనేక విషయాలను పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌ ద్వారా సీసీసీ నుంచి చెబుతారు. దీంతో రద్దీ ఎక్కువగా ఉండి, ట్రాఫిక్‌లో ఎక్కువ సేవు చిక్కుకోకుండా వాహనదారులు అప్రమత్తమవుతారు. ఏదైనా నేరం జరిగినా, దొంగ నంబర్లు వేసుకొని తిరిగే వాహనాలను ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు గుర్తిస్తాయి. ఆ సమాచారాన్ని ట్రాఫిక్‌ పోలీసులకు అందిస్తాయి. ఆయా కూడళ్ల నుంచి వచ్చే వాహనాలను లెక్కిస్తూ , ఎప్పటికప్పుడు డాటాను అందిస్తుంటాయి.

  • 04 Aug 2022 01:36 PM (IST)

    వీడియోకాల్‌ తో పోలీసుల సహాయం

    ఎవరైనా ఆపదలో ఉంటే నగరంలో ఎమర్జెన్సీ కాయిన్‌ బాక్స్‌ల నుంచి వీడియోకాల్‌ చేసి పోలీసుల సహాయం పొందేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. అయితే ఇందులో ప్రధానమైన హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాలను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు నగరంలో ఏర్పాటైన 7.5 లక్షల సీసీ కెమెరాలను ఈ సెంటర్‌కు అనుసంధానం చేస్తారు. ఇందులో ప్రధానంగా ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌, పండుగలు, వేడుకలు, రాజకీయ పార్టీలు, ఆందోళనలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు.

  • 04 Aug 2022 01:35 PM (IST)

    అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం

    అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకల హంగులతో బంజారాహిల్స్‌ రోడ్డు నెం.12లో సర్వాంగ సుందరంగా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. నేరం జరిగినా, ట్రాఫిక్‌ రద్దీ పెరిగినా క్షణాల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సాధారణ కెమెరాలతో పాటు, ఏఎన్‌పీఆర్‌(ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌) కెమెరాలను సీసీసీకి అనుసంధానం చేసి ఉండడంతో వేగంగా దర్యాప్తు జరుగుతుంది.

  • 04 Aug 2022 01:33 PM (IST)

    600 కోట్లు.. 19 అంతస్తులు.. నాలుగు ఐదు టవర్లు..

    పోలీస్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.. 600 కోట్లు.. 19 అంతస్తులు.. నాలుగు ఐదు టవర్లు.. అధునాతన హంగులు.. దేశంలో ఎక్కడా లేదు.. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించే వీలు ఉండేలా నిర్మించారు.. అన్ని శాఖల్లో సమన్వయపరుస్తూ ఇక్కడ సమావేశాలు పెట్టుకోవచ్చు అంతేకాదు లైవ్‌లో ఆపరేషన్స్ చూడవచ్చు అమెరికా లాంటి దేశాల్లో ఉన్న అధునాతన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు

  • 04 Aug 2022 01:23 PM (IST)

    కేసీఆర్‌ కీలక సూచనలు..

    కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభించిన తర్వాత.. దానిని నిశితంగా పరిశీలించారు సీఎం కేసీఆర్.. అక్కడ ఉండే వసతులను.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు సీఎంకు వివరించగా.. సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజేపీ మహేందర్‌రెడ్డికి కొన్ని సూచనలు చేశారు ముఖ్యమంత్రి

  • 04 Aug 2022 01:20 PM (IST)

    కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం..

    పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. సీసీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీతో పాటు మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి.. తదితరులు పాల్గొన్నారు..

  • 04 Aug 2022 01:16 PM (IST)

    కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం

    పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంబోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు సీఎం కేసీఆర్..

Exit mobile version