NTV Telugu Site icon

CM KCR: ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్.. ప్రారంభించిన సీఎం

Kcr

Kcr

CM KCR inaugurated BRS office in Delhi: ఇవాళ ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్‌ఎస్ భవన్‌ను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ప్రారంభించారు. భవన ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం భవన్‌ శిలాఫలకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. తరువాత ఎం. 1:05 గంటలకు కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి భవనంలోకి ప్రవేశించారు. కేసీఆర్ భవన్‌లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భవనంలోని మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌లోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నారు కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేసీఆర్ మరికాసేపట్లో తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేష్ నేత, సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ భవన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.

Read also: Health Tips: ఆపిల్ గింజలతోనే జ్యూస్ చేస్తున్నారా?

కాగా.. సెప్టెంబర్ 2, 2021న ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. నాలుగు అంతస్తులతో మొత్తం 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దిగువ మైదానంలో మీడియా హాల్ మరియు సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంటీన్, రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్లు, మొదటి అంతస్తులో బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఛాంబర్, ఇతర ఛాంబర్లు, సమావేశ మందిరాలు, 2, 3 అంతస్తుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్, ఇతర 18 గదులు అందుబాటులో ఉన్నాయి.
Bandi sanjay: పొంగులేటితో ఈటల బృందం భేటీ.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు