NTV Telugu Site icon

CM KCR: పోడు భూములపై సీఎం కీలక వ్యాఖ్యలు

Cm Kcr

Cm Kcr

CM KCR: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌ పద్దులపై చర్చ కొనసాగింది. ముందుగా స్పీకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు సీఎం. అనంతరం పోడు భూముల విషయంలో సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల గురించి మాట్లాడటం చాలా తేలిక అన్నారు. ఆక్రమణ కాదు.. దురాక్రమణ అంటూ మండిపడ్డారు. అడవి బిడ్డలం అయితే.. అడవి అంతా కొట్టేస్తారా? అంటూ ప్రశ్నించారు. జెండాలు పట్టుకుని ధర్నాలు చేయడం కొన్ని పార్టీలకు అలవాటు అయ్యిందన్నారు. గిరిజనుల హక్కులు కాపాడాల్సిదే కానీ.. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా..కనుమరుగు కావాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. అడవులు ఎవరి పుణ్యంతో నాశనం అవుతున్నాయో చూశామని సీఎం కేసీఆర్‌ అన్నారు కమ్యూనిస్టులు వచ్చినా.. భట్టి వచ్చినప్పుడు చెప్పిన అన్నారు. పొడు భూములు సాగు చేసుకుంటున్న వారికి ఇస్తాం.. పొడు ఇలాగే కొనసాగాలా ముగింపు ఉండాలా? అంటూ ప్రశ్నించారు. పొడు భూముల పంపిణీ తర్వాత.. ఇంకా భూమి లేని గిరిజనులు ఉంటే గిరిజన బంధు ఇద్దాం అని చెప్పినాని సీఎం తెలిపారు. 11 లక్షల ఎకరాల భూమి పోయిందని, 66 లక్షల ఎకరాల భూమి కాపాడండి అని చెప్పిన అన్నారు. అధికారులకు.. ఓ సారి నిర్ణయం చేసి తేల్చేద్దం అని చెప్పినా అని సీఎం పేర్కొన్నారు.

Read also:Harish rao: అక్కడ మా పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మెడికల్ కాలేజీ ఇచ్చాం

సర్పంచ్.. ఎంపీటీసీ.. గిరిజన పెద్దలు.. ప్రతిపక్ష నాయకులు సంతకం పెడితేనె భూముల పట్టా పంపిణీ చేస్తామన్నారు. ఉన్నవి కాకుండా కొత్తగా పొడు చేస్తాం అంటే పట్టాలు ఇవ్వమని స్పష్టం చేశారు. అటవీ అధికారులు పై దాడి చేసి చంపొచ్చా? అని మండిపడ్డారు. పొడు భూములు న్యాయమైన డిమాండ్ కాదన్నారు. ప్రభుత్వం దయతలిసి ఇస్తే తీసుకోవాలి అంతేకాని ఇలా చేయడం సరికాదన్నారు. పొడు భూములు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రైతు బంధు కూడా ఇస్తామన్నారు. పోడు భూముల పట్టాలు ఫిబ్రవరి నెలాఖరులో ఇస్తామన్నారు. కానీ రాత పూర్వకంగా వాళ్ళు మాకు లేఖ ఇవ్వాలని స్పష్టం చేశారు. అటవీ మేమే కాపడుతం అని ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. కొన్ని పార్టీలకు పొడు భూములే దొరికాయని, జెండా పట్టుకుని ధర్నాలు చేసుడు ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తి కోయలు ఇక్కడి వాళ్లే కాదు.. అధికారులను చంపుడు కూడా మంచిది కాదు కదా? అని ప్రశ్నించారు. అట్లా చేస్తాం అంటే మేము చేతులు ముడుచుకుని ఉండం మంటూ మండిపడ్డారు. ఇదే చివరి పంపిణీ… మళ్ళీ ఉండదు అని సీఎం అన్నారు. సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కొందరు అగ్ర కులాలు గిరిజన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని అటవీ భూముల అక్రమిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో ఇలాంటివి ఎక్కువ ఉన్నాయని తెలిపారు. వివరాలు సభ ముందు పెట్టమంటే పెడతామన్నారు. ఇకపై పోడు అనేది ఉండదని సభాముఖంగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.
Formula E Racing: ‘ఫార్ములా-ఇ’ రేసు.. అలరించనున్న సాగరతీరం..