ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ స్పష్టతను ఇచ్చారు. నేడు తెలంగాణ కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆహార భద్రతలో భాగంగా ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత… భరించాలి… కానీ కేంద్రం తప్పించుకుంటుందని ఆయన మండిపడ్డారు. కేంద్రం దగ్గర డబ్బులు లేవా… ప్రధానికి మనస్సు లేదా అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే పాపాల పుట్ట బయట పెడతామని, లండన్ లో ఉన్న వారిని అరెస్ట్ చేయడానికి వెళితే వెనక్కి పిలిపించారు… ఆ డాక్యు మెంట్ లు మా దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. దొంగలకు పదిన్నర లక్షల కోట్లు మాఫీ చేశారని, రైతుల కోసం 3 వేల కోట్లు ఖర్చు చేయరా ఆయన విమర్శించారు.
కేంద్రాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేశామని, కేంద్రంలో వెధవ, పనికి మాలిన ప్రభుత్వం వల్ల వరి వేయొద్దని చెప్పాము… బీజేపీ నేతలు రెచ్చగొట్టారన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, రేపటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తామన్నారు. నలుగురు అధికారులతో కమిటీ వేశామని, నాలుగు రోజుల్లో కొనుగోలు చేస్తాం… రైతులు కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయికి కూడా తక్కువకు అమ్మొద్దని కేసీఆర్ రైతులకు సూచించారు.
https://ntvtelugu.com/cm-kcr-satire-on-central-government/
