తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్ళారు. సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి వుంది. అయితే అనారోగ్యం వల్ల ఆయన పర్యటన రద్దయింది.ఇటీవల కాలంలో ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళి వచ్చారు. ఈమధ్యకాలంలో తీవ్ర వత్తిడికి గురయ్యారు. అస్వస్థత కారణంగా యాదాద్రికి వెళ్ళి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి వుంది. కానీ పర్యటన రద్దు చేశారు. ముఖ్యమంత్రి హెల్త్ కు సంబంధించి హెల్త్ బులిటిన్ విడుదల చేసే అవకాశం వుంది. ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ MV రావు చెప్పారు. రెండురోజులుగా కేసీఆర్ నీరసంగా వున్నారని డాక్టర్లు తెలిపారు.
