గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అన్నారు. అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
Read: గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ?
ఎస్సారెస్సీకి వరద ఉదృతి బాగా పెరిగిందని, పరివాహ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌లో పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సీఎస్‌ను ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదీప్రాంతాల్లో వరదలు వస్తున్నాయని, ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం వలన అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని అన్నారు. ప్రజలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.