Site icon NTV Telugu

Breaking : దళిత బంధు గురించి అసలు నిజం చెప్పిన కేసీఆర్‌..

తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను కేసీఆర్‌ వివరించారు. అంతేకాకుండా స్వరాష్ట్రం సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. స్వరాష్ట్ర సాధన తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకొచ్చారు. అయితే పథకాల్లో అగ్రస్థానంలో ఉన్న దళిత బంధు గురించి పలు కీలక విషయాలను సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. దళిత బంధులో మూడు పార్వ్శలు ఉన్నాయన్నారు. మొదటిది.. ఎలాంటి అంక్షలు లేనటువంటి ఆర్థిక ప్రేరణ, సులభంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే మార్గం ఇవ్వడం.

రెండవది.. అన్నిట్లో రిజర్వేషన్లు కల్పించడం.. మూడవది.. ప్రపంచంలోనే ఎక్కడాలేనటువంటి సపోర్టీవ్‌ స్ర్టక్చర్‌.. అని ఆయన వెల్లడించారు. మొదటి విధానంతో.. పదిహేడున్నర లక్షల దళిత కుటుంబాలకు సంవత్సరానికి 2 నుంచి 2.50 లక్షల చొప్పున, ఒక్కొ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేయడమని, ఎలాంటి బ్యాంక్‌ లింకేజీ లేకుండా, ఎలాంటి తిరిగిచెల్లింపులు లేకుండా.. లబ్దిదారులకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవచ్చన్నారు. రెండవ విధానంతో.. వైన్స్‌, ఫర్టిలేజర్‌, ఇలా అన్నింట్లో రిజర్వేషన్‌ కల్పించామన్నారు. అంతేకాకుండా మూడవ విధానం సపోర్టీవ్‌ స్ర్టక్చర్‌లో భాగంగా.. దళిత బంధు ద్వారా వచ్చే రూ. 10 లక్షల నుంచి రూ.10 వేలు లబ్దిదారుని తరుఫున తీసి.. దానికి ప్రభుత్వం తరుఫున రూ.10 వేలు కలిపి జమచేస్తుందన్నారు.

ఒక నియోజకవర్గంలో 20 వేల దళిత కుటుంబాలు ఉంటే.. ఆ నియోజకవర్గం యూనిట్‌గా రూ.40 కోట్లు ఉంటాయని కేసీఆర్‌ వెల్లడించారు. ఆ డబ్బుపై ఎవరికీ పెత్తనం లేదన్నారు. దళిత బంధుతో బిలో పవర్టి లైన్ నుంచి ఎబో పవర్టి లైన్‌లోకి వచ్చిన వారు మళ్లీ ఏ కారణం చేతగానీ బిలో పవర్టీ లైన్‌లోకి పడిపోకుండా ఉండేందుకు ఎంతో మంది మేథావులతో మేథోమదనం చేసి ఈ పథకాన్ని రూపొందించామన్నారు.

Exit mobile version