Site icon NTV Telugu

Lal Darwaza Bonalu: లాల్‌ దర్వాజ బోనాల్లో ఘర్షణ.. ఆందోళనకు దిగిన ఓవర్గం..

Lal Darwaza Bonalu

Lal Darwaza Bonalu

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు పండుగ ఘనంగా జరుగుతుంది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంగణం అంతా పల్లె వాతావరణాన్ని తలిపించింది. అయితే ఈనేపథ్యంలో.. పాతబస్తీ లాల్‌ దర్వాజా బోనాల ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అమ్మవారి ఆలయ సమీపంలో ఓ బృందంపై కొందరు కర్రలతో దాడి చేయడంతో.. ఉద్రికత్త పరిస్థతి నెలకొంది. పోతలింగం ఆలయానికి చెందిన పోతురాజులు రవీందర్‌, సుధాకర్‌లు సుమారు 20మంది బృందంతో లాల్‌ దర్వాజా మహంకాళి ఆలయానికి వెళ్లారు. అయితే.. అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా, నాగం కాంప్లెక్స్‌ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు వారితో గొడవపడ్డారు. వారికి .. కర్రలతో దాడి చేసారు. దొరికిన వారిని దొరికినట్టు వీరబాదుడు బాదారు. ఈదాడిలో.. కొందరికి తీవ్ర గాయాలుకాగా.. పోతురాజు రవీందర్‌కు ఎడమకంటి వద్ద గాయం కావడంతో రక్తస్రావమైంది.

read also: Kodad Politics : అక్కడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పార్టీ కేడర్ కూతపెడుతుందా..?

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చుకున్నారు. పాత గొడవలే దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవ పడుతున్న వారిని సౌత్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. ఈనేపథ్యంలో.. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ సీపీ చౌహాన్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇదిఇలా వుండగా.. మరో వైపు.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక వర్గం వారు సింహవాహిని అమ్మవారి దేవాలయం వద్ద నిరసన చేపట్టారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే.. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కానీ.. ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మళ్లీ ఈరోజు పాతబస్తీ చత్రి నాకా పోలీస్ స్టేషన్ ఆందోళన చేపట్టారు. వారిని సముదాయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Business Headlines: భూటాన్‌ టూర్‌ భారమే. మనోళ్లకి కాస్త నయం. వేరే దేశాలకు మరీ..

Exit mobile version