తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు పండుగ ఘనంగా జరుగుతుంది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంగణం అంతా పల్లె వాతావరణాన్ని తలిపించింది. అయితే ఈనేపథ్యంలో.. పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అమ్మవారి ఆలయ సమీపంలో ఓ బృందంపై కొందరు కర్రలతో దాడి చేయడంతో.. ఉద్రికత్త పరిస్థతి నెలకొంది. పోతలింగం ఆలయానికి చెందిన పోతురాజులు రవీందర్, సుధాకర్‌లు సుమారు 20మంది బృందంతో లాల్ దర్వాజా మహంకాళి…