NTV Telugu Site icon

హైద‌రాబాద్‌కు సీజేఐ.. స్వాగ‌తం ప‌లికిన కేటీఆర్

CJI

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హైద‌రాబాద్ చేరుకున్నారు.. సీజేఐగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఆయ‌న హైద‌రాబాద్‌కు రావ‌డం ఇదే తొలిసారి.. ఇక‌, తిరుప‌తి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి త‌దిత‌రులు.. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్నారు సీజేఐ.. ఇక‌, రాజ్‌భ‌వ‌న్‌లో సీజేఐకి స్వాగ‌తం ప‌లికేందుకు ఇప్ప‌టికే అక్క‌డికి చేరుకున్నారు సీఎం కేసీఆర్.