Fake Passport Scam: రాష్ట్రంలో నకిలీ పాస్ పోర్ట్ స్కాం.. 92 మందికి లుక్ ఔట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Passport Scam: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ పాస్‌పోర్టు స్కాం కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. నకిలీ పత్రాలు సృష్టించి ఇతర దేశాలకు చెందిన వారికి పాస్‌పోర్టులు జారీ చేసిన కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతపురంకు చెందిన ఏజెంట్‌తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాస్‌పోర్టులతో పాటు పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని సీఐడీ అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కు చేరింది. ఈ కేసులో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ అల్ జవహరి నిలోఫర్ హాస్పిటల్ పేరుతో విదేశీయుల కోసం నకిలీ ఆధార్, పాన్ కార్డులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే 92 మంది విదేశీయులు నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు తీసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఆ దేశాల్లో విదేశీయులు భారతీయ పౌరులుగా చెలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్‌నుమా చిరునామాలతో కూడిన పాస్‌పోర్టులు ఎక్కువగా తీసుకున్నట్లు విచారణలో తేలింది.
Also Read
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
Read also: Kejriwal: బీజేపీ కుట్ర.. మా ఎమ్మెల్యేలను కొనేందుకే నన్ను అరెస్ట్ చేస్తారటా..?
ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసే పనిలో సీఐడీ నిమగ్నమైంది. ఒకే చిరునామాతో ఎక్కువ మంది పాస్‌పోర్టులు పొందినట్లు సీఐడీ వెల్లడించింది. ఇప్పటికే కొందరు నకిలీ పాస్ పోర్టులతో విదేశాలకు వెళ్లగా.. మిగిలిన వారు దేశం దాటకుండా లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో సీఐడీ అధికారులు 35కి పైగా పాస్‌పోర్టులను రద్దు చేయాలని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి సమాచారం అందించారు.
మరోవైపు పాస్ పోర్టుల జారీలో కీలకపాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రక్రియ పూర్తి చేసి పాస్‌పోర్టు ఇప్పించేందుకు ఏజెంట్లు అధికారులకు లంచాలు ఇచ్చినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది. విజిటింగ్ వీసాలతో థాయ్ లాండ్, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లినట్లు వెల్లడైంది.
Suryapet Municipality: మున్సిపల్ ఆఫీసుల్లో అవిశ్వాస తీర్మానం… హాజరు కానీ కౌన్సిలర్లు..!
తాజావార్తలు
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!