Chinna Reddy : పదవి పోయినా గౌరవం ఉంది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు

  • ‘నాకు పదవిపై షోకు లేదు’
  • ‘పదవి ఉన్నా లేకున్నా గౌరవం ఉంది’
  • సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదు
  • వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన చిన్నారెడ్డి
Cinna Reddy

Cinna Reddy

Chinna Reddy : తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవిపై ఎలాంటి షోకులేదని స్పష్టం చేశారు. తనకు ప్లానింగ్ కమిషన్ పదవిని ‘టిల్ ఫర్దర్ ఆర్డర్స్’ పేరుతో ఇచ్చారని, ఈరోజే ఆ ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని చిన్నారెడ్డి వెల్లడించారు. పదవి ఉన్నా లేకపోయినా తనకు గౌరవం ఉందని అన్నారు.

గతంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ప్రోటోకాల్ సదుపాయాలను తాను వదులుకున్నానని గుర్తుచేశారు. పదవి నుంచి తొలగించిన వెంటనే చిన్నారెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన అనుచరులు, మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుత పరిణామాలపై మరింతగా స్పందించకుండా మౌనం పాటించారు.