NTV Telugu Site icon

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో చిన్న జీయర్ భేటీ.. విషయం ఇదే..

ఢిల్లీలో పర్యటనలో ఉన్న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయును కలిశారు.. 2022 ఫిబ్రవరిలో జరగనున్న సమతా ప్రతిమ (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.. మొదట ఉపరాష్ట్రపతిని కలిసిన ఆహ్వానం పలకగా.. వివక్షలను నిర్మూలించి సమానత్వ సాధన కోసం భగవద్రామానుజులు కృషి చేశారని.. అతిపెద్ద ప్రతిమ ఏర్పాటు… ప్రపంచానికి రామానుజుని బోధనలు, సందేశం విస్తరించేందుకు తోడ్పడుతుందని ఆకాక్షించారు వెంకయ్య.. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపు మాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక, సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని తెలిపారు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.

ఇక, ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన చిన్న జీయర్‌ స్వామీ.. హైదరాబాద్ ముచ్చింతల్ లో 2022 ఫిబ్రవరిలో జరగనున్న 216 అడుగుల సమతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, ధనుష్ ఇన్ఫోటెక్ సీఎండీ డీఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.