Chevella Bus Accident: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం ఓ కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన దంపతులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన వారు కురుగుంట బందేప్ప (45), కురుగుంట లక్ష్మి (43). వీరిద్దరూ జీవనోపాధి కోసం అడ్డా కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అయితే.. లక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శరీరంలో బలహీనత, అస్వస్థత కారణంగా వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున భార్యాభర్తలు చేవెళ్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణం ప్రారంభించారు. అయితే దురదృష్టవశాత్తు, చేవెళ్ల సమీపంలో బస్సు టిప్పర్ వాహనాన్ని ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Sajjala Ramakrishna Reddy: సర్కార్‌పై సజ్జల ఫైర్.. ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది..!
ఈ ఘటనతో హాజీపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కురుగుంట బందేప్ప-లక్ష్మి దంపతులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇద్దరు చిన్న పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలుగా మారారు. గ్రామస్థులు, బంధువులు ఆ చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు కోల్పోయిన దంపతుల మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అధికారులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షలు, ప్రధాని మోడీ 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Chevella Accident : చేవెళ్ల ప్రమాదం వెనుక నిజాలు బహిర్గతం చేసిన ప్రత్యక్ష సాక్షి !
