Site icon NTV Telugu

Solar Roof Cycling Track: సైక్లింగ్ ట్రాక్ ఒక ట్రెండ్ సెట్టర్-ఎంపీ రంజిత్‌ రెడ్డి

Ranjith Reddy

Ranjith Reddy

Solar Roof Cycling Track: కోకాపేట లే అవుట్ లో రూ.95 కోట్లతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్క గుండా 4.5 మీటర్ల వెడల్పు 23 కిలోమీటర్ల వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సోలార్ రూప్ సైక్లింగ్ ట్రాక్ నిర్మాణపు పనులను పరిశీలించారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రె.. నానక్ రాంగూడ నుండి టీఎస్పీఏ వరకు, నార్సింగ్ నుండి కొల్లూరు వరకు ఈ నిర్మాణం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలిపిన ఆయన.. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఈ సైక్లింగ్ ట్రాక్ ఇండియాలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు.. కాగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజాఉపయోగమైన నాన్‌ మోటరైజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెల్యూషన్స్‌ను ఉద్దేశంతో సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం..

Read Also: Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో జేసీ సోదరులు బిచ్చం ఎత్తుకోవాల్సిందే..!

భారత్‌లో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి ట్రాక్‌లు లేవు.. కానీ, హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రారంభించారు.. విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని, దానికి తగినట్లుగా స్థానికంగా ఉండే యువకులు, ఐటీ రంగాల్లో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్‌ నుంచి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్‌ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం ఆఫీస్‌కి వెళ్లికి రాకుండా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం సైతం బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది ప్రారంభించినట్టు గతంలో మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే.. ప్రస్తుతం అందరికీ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుందని.. 24 గంటలు ఈ ట్రాక్‌ అందుబాటులో ఉండేలా.. అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లందరికీ ఉత్సాహపరిచేలా భారత్‌లో తొలిసారిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్‌. జర్మనీ, సౌత్‌ కొరియా, ఇతర దేశాలకు దీటుగా నాలుగున్నర మీటర్ల వైశాల్యంతో ప్రపంచ స్థాయి నిర్మాణాన్ని చేపట్టారు.. భవిష్యత్‌ అంతర్జాతీయ సైక్లింగ్‌ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా నిర్మాణం జరుగుతోంది.. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడెల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను.. 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తున్నారు.. ఈ ఏడాదిలో అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా పెట్టుకుని వేగంగా పనులు చేస్తోంది.

Exit mobile version